హారన్ మోగిందో ఇక చాలాన్ పడినట్టే.. హైదరాబాద్‌లో కొత్త రూల్స్
- May 23, 2022
హైదరాబాద్: హైదరాబాద్ సిటీని శబ్దకాలుష్యం నుంచి విముక్తి చేయడానికి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. అధిక శబ్దాలు, ఒళ్లు జలదరించే హారన్లు వినియోగించే వారిపై కేంద్ర మోటారు వాహనాల చట్టం-1989 కింద రూ.1000 జరిమానాతోపాటు కేసు నమోదు చేయనున్నారు. ఈ మేరకు జూన్ 1 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈనెల 10వ తేదీ నుంచి హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భారీ శబ్దాలు వచ్చే 3,320 హారన్లను కూడా రిమూవ్ చేశారు. వాహన కంపెనీ తయారు చేసిన హారన్ కాకుండా ఇతర హారన్లు ఉపయోగిస్తే అట్లాంటి వారిపై కేసు నమోదుతో పాటు చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలిపారు. హారన్‌తోపాటు సైరన్ ఉపయోగించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







