భారత్‌లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు పాక్ ఐఎస్‌ఐ కుట్ర
- May 23, 2022
న్యూఢిల్లీ: భారత్‌లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు పాకిస్తాన్ ఐఎస్‌ఐ ప్లాన్ చేసినట్లు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరిక జారీ చేసింది.
దేశంలోని పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ భారీ కుట్ర పన్నిందని హెచ్చరికలు జారీ చేశాయి.
పంజాబ్‌తోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్‌లను పేల్చివేయాలని ఐఎస్‌ఐ కార్యకర్తలు ప్లాన్ చేశారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేసింది. సరుకు రవాణా రైళ్లు ఢీకొట్టేందుకు రైల్వే ట్రాక్‌లను పేల్చివేయటానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు భారత నిఘా సంస్థలు తెలిపాయి.
రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడేందుకు ఐఎస్‌ఐ భారతదేశంలోని తన కార్యకర్తలకు పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నట్లు కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. భారత్‌లో ఉన్న పాక్ స్లీపర్ సెల్స్ తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు వారికి భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నట్లు వెల్లడించాయి.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







