రాష్ట్రంలో వడగాల్పుల కారణంగా 45 మంది మృతి..

- April 07, 2016 , by Maagulf
రాష్ట్రంలో వడగాల్పుల కారణంగా 45 మంది మృతి..

రాష్ట్రంలో వడగాల్పుల కారణంగా ఇప్పటివరకు 45 మంది మృతిచెందినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కడప జిల్లాలో అత్యధికంగా 16 మంది మృతిచెందినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వీస్తున్న వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వడగాల్పుల బారిన పడిన వారికి తక్షణం వైద్యం అందించేందుకు ఆయా ఆస్పత్రుల సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. వడదెబ్బ మృతుల కుటుంబాలను తమ ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.జిల్లాల వారీగా మృతుల సంఖ్య * కడప - 16 * ప్రకాశం - 11 * అనంతపుంర - 4 * విజయనగరం - 3 * చిత్తూరు - 3 * కర్నూలు - 3 * శ్రీకాకుళం - 2 * కృష్ణా - 2 * పశ్చిమగోదావరి -1

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com