షార్జాలో యూఏఈ మొదటి వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌ను ప్రారంభించిన షేక్ సుల్తాన్

- May 25, 2022 , by Maagulf
షార్జాలో యూఏఈ మొదటి వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌ను ప్రారంభించిన షేక్ సుల్తాన్

యూఏఈ: సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి.. మధ్యప్రాచ్యంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన షార్జా వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌ను ప్రారంభించారు. షార్జా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ అనేది ఎమిరేట్స్ వేస్ట్ టు ఎనర్జీ మొదటి ప్రాజెక్ట్. ఇది బీయా (BEEAH) గ్రూప్ పునరుత్పాదక ఇంధన వ్యాపారమైన BEEAH ఎనర్జీ, ప్రపంచంలోని ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థలలో ఒకటైన మస్దార్‌చే స్థాపించబడిన జాయింట్ వెంచర్. ఏప్రిల్‌లో దీని నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. ఈ ప్లాంట్ షార్జాను మధ్యప్రాచ్యంలో మొదటి జీరో-వేస్ట్ సిటీగా నిలుపుతుంది. ఇది యూఏఈ అంతటా వ్యర్థాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ప్లాంట్ ప్రతి సంవత్సరం 300,000 టన్నుల రీసైకిల్ చేయలేని వ్యర్థాలను ల్యాండ్‌ఫిల్ నుండి దూరంగా మళ్లించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో షార్జాలోని 28,000 గృహాలకు శక్తినిచ్చే 30 మెగావాట్ల (MW) తక్కువ కార్బన్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. BEEAH గ్గ్రూప్ సీఈఓ ఖలీద్ అల్ హురైమెల్ మాట్లాడుతూ.. యూఏఈలో క్లీన్ ఎనర్జీ ఆవిష్కరణలకు మార్గదర్శకత్వం వహించేందుకు  ఎమిరేట్స్ వేస్ట్ టు ఎనర్జీ వెంచర్‌ నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు. జీరో-వేస్ట్, క్లీన్-ఎనర్జీ భవిష్యత్తు కోసం తాము పని చేస్తున్నట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com