‘ఎఫ్ 3’ కి హ్యాండిచ్చిన తమన్నా: రీజన్ ఏంటంటే.!

- May 25, 2022 , by Maagulf
‘ఎఫ్ 3’ కి హ్యాండిచ్చిన తమన్నా: రీజన్ ఏంటంటే.!

ఇంతవరకూ ఫ్లాప్ చవి చూడని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నుంచి వస్తున్న మరో తాజా చిత్రం ‘ఎఫ్ 3’. ప్రీ రిలీజ్ బజ్ ఎలా వున్నా, ‘ఎఫ్ 3’ పక్కా హిట్టు బొమ్మ అని తేల్చేశారు సినీ అభిమానులు. కంటెంట్ అలాంటిది మరి.  

అన్ని వర్గాల అభిమానుల్నీ అలరించే నవ్వుల కాన్సెప్టుతో పక్కా కమర్షియల్ వేల్యూస్‌తో అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, హనీ పాప మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అసలు విషయానికి వచ్చేద్దాం. మిల్కీ బ్యూటీ తమన్నా. లీడ్ హీరోయిన్ రోల్ పోషిస్తున్న తమన్నా, ఈ సినిమా ప్రమోషన్లలో అస్సలు కనిపించడం లేదు. సర్లే, రాక రాక వచ్చిన ఛాన్స్ కదా.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో తళుకులీనుతూ బిజీగా ఎంజాయ్ చేస్తోందిలే.. అనుకున్నాం.

ఇప్పుడు ఆ పండగ ముగిసింది. ఇక ఇప్పుడైనా తమన్నా దర్శనం కల్గుతుందా.? అంటే అదీ లేదు. ఆ తర్వాత విదేశాల్లో బీచ్‌ల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తమన్నా ఎందుకిలా చేస్తోంది.? ప్రమోషన్లలో తమన్నా చాలా యాక్టివ్‌గా వుంటుంది. కానీ, ‘ఎఫ్ 3’ విషయంలో చిత్ర యూనిట్‌కీ, తమన్నాకీ మధ్య ఏం జరుగుతోంది.?

రెమ్యునరేషన్ విషయంలో కాస్త కిరి కిరి జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. తమన్నాకి సెటిల్ చేయాల్సిన ఫైనల్ అమౌంట్ సెటిల్ చేయకపోవడం వల్లే తమన్నా ‘ఎఫ్ 3’ ప్రమోషన్లకు హ్యాండిచ్చిందని అంటున్నారు. లేకుంటే, వీలు కాకుంటే, ఎట్ లీస్ట్ సోషల్ మీడియా వేదికగానైనా చిన్న వీడియో బైట్స్ రూపంలోనైనా ప్రమోషన్లలో పాల్గొని వుండొచ్చు కదా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com