ట్రెండింగ్‌లో కమల్ హాసన్ ‘విక్రమ్’: మహేష్‌ని ఫాలో అవుతున్నాడా.?
- May 25, 2022
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా రిలీజ్‌కి ముందు ఏ రేంజ్‌లో ట్రెండింగ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ మాటకొస్తే, టాక్‌తో సంబంధం లేకుండా, రిలీజ్ తర్వాత కూడా ‘సర్కారు వారి పాట’ ట్రెండింగ్ మామూలుగా లేదు.
#SVP, #Sarkaruvaripata.. #DisasterSVP,#BlockBusterSVP.. ఇలా రకరకాల హ్యాష్ ట్యాగ్‌లతో మహేష్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు, వీటితో పాటు సూపర్ స్టార్ ఎమోజీలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసిన సంగతి తెలిసిందే.
మొదట్లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా, ఫైనల్‌గా ‘ఎస్‌వీపీ’ సూపర్ హిట్టు, బ్లాక్ బస్టర్ హిట్టు లిస్టులోకి చేరిపోయిందనుకోండి. ఇప్పుడీ చర్చ ఎందుకంటే, ఇదే బాటలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న ‘విక్రమ్’ సినిమా కూడా ట్రెండింగ్ అవుతోంది.
త్వరలోనే ‘విక్రమ్’ మూవీ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజవుతున్న ఈ సినిమాని సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చగా ట్రెండింగ్ చేస్తున్నారు. రకరకాల హ్యాష్ ట్యాగులు క్రియేట్ చేసి, కమల్ అభిమానులు సూపర్ యాక్టివ్‌గా వున్నారు.
ఫుల్ ఆఫ్ పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘విక్రమ్’జూన్ 3 న రిలీజ్ కానుంది. జూన్ 13 వరకూ ఈ హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో వుండనున్నాయి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజీక్ అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







