అక్కినేని కాంపౌండ్‌లో బిందు మాధవి.?
- May 25, 2022
బిగ్‌బాస్ విన్నర్‌గా బిందు మాధవి సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, బిగ్‌బాస్ ద్వారా వచ్చిన ఫేమ్‌తో పెద్ద తెరపై పెద్దగా సక్సెస్ అయిన ముద్దుగుమ్మలెవరూ లేరింతవరకూ. కానీ, ఆ లోటు కూడా బిందు మాధవి తీర్చేసేలా వుంది. బిగ్‌బాస్ ఫేమ్‌తో బిందు మాధవికి ఆఫర్లు క్యూ కడుతున్నాయట.
ఆల్రెడీ హీరోయిన్గా గతంలో సత్తా చాటిన బిందు మాధవి, ఇకపై వెండితెరపై సూపర్ సక్సెస్ బాటలో పయనించబోతోందట. తెలుగులో ఇప్పటికే అక్కినేని కాంపౌండ్ నుంచి ఓ బంపర్ ఛాన్స్ కొట్టేసిందట. అక్కినేని హీరో నాగ చైతన్య సినిమాలో బిందు మాధవి ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు.
హీరోయిన్గా మంచి పొటెన్షియాలిటీ వున్న తెలుగమ్మాయ్ బిందు మాధవి. ఆ విషయం ఆమె గత చిత్రాలైన ‘ఆవకాయ్ బిర్యానీ’, ‘బంపర్ ఆఫర్’ తదితర చిత్రాల ద్వారా ప్రూవ్ అయ్యింది.
అలాగే, తమిళంలోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా సత్తా చాటింది బిందు మాధవి. చూస్తుంటే, బిగ్‌బాస్ పుణ్యమా అని, ఈ సారి బిందు మాధవి కెరీర్‌కి ఎలాంటి ఢోకా లేదనిపిస్తోంది. ఓ వైపు తెలుగులోనూ, మరోవైపు తమిళంలోనూ కూడా క్రేజీ ఆఫర్లు తన ఖాతాలో వేసుకోబోతుందట బిందు మాధవి.
సో, ఈ రకంగానూ మన తెలుగమ్మాయ్ సెన్సేషన్ క్రియేట్ చేయనుందన్న మాట.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







