సౌక్ అల్ మనామాలో గైడెడ్ టూర్లను ప్రారంభించిన బహ్రెయిన్ టూరిజం

- May 25, 2022 , by Maagulf
సౌక్ అల్ మనామాలో గైడెడ్ టూర్లను ప్రారంభించిన బహ్రెయిన్ టూరిజం

బహ్రెయిన్: బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ, సౌక్ అల్ మనామాలో గైడెడ్ టూర్లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి గురించి పర్యాటకులు ఈ గైడెడ్ టూర్ల ద్వారా సులభంగా తెలుసుకునేందుకు వీలవుతుంది. ఈ టూర్లు ప్రత్యేకమైన అనుభూతిని పర్యాటకులకు అందిస్తాయి. ఏళ్ళ తరబడి మల్టీ కల్చరల్ కమ్యూనిటీస్ ఇక్కడ వర్ధిల్లుతున్న తీరుని పర్యాటకులు సవివరంగా తెలుసుకోవచ్చు. బాబ్ అల్ బహ్రెయిన్ ప్రాంతం నుంచి లైసెన్సు పొందిన గైడ్లు టూరిస్టులకు అందుబాటులో వుంటారు. మే 26 నుంచి శని మరియు బుధవారాల్లో ప్రత్యేకంగా ఈ టూర్లు వుంటాయి. పుడ్ డైవర్సిటీ ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ. అథారిటీ వెబ్‌సైట్ ద్వారా టూర్లను బుక్ చేసుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com