కంపెనీల కోసం మొబైల్ వీసా స్క్రీనింగ్ క్లినిక్ ప్రారంభం
- May 25, 2022
యూఏఈ: అబుదాబీలో కొత్తగా కంపెనీల కోసం మొబైల్ వీసా స్క్రీనింగ్ క్లినిక్ ప్రారంభమైంది. అబుదాబీ హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా) వెల్లడించిన వివరాల ప్రకారం, కార్పొరేషన్లకు వీసా స్క్రీనింగ్ సేవల యాక్సెస్‌ని మెరుగు పర్చేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ కొత్త క్లినిక్ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. సెహా అంబులేటరీ హెల్త్ కేర్ సర్వీసెస్ చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ ఒమర్ అబ్దుల్ రెహమ్మాన్ అల్ హషామి మాట్లాడుతూ, ఈ క్లినిక్ ప్రారంభించడం ఆనందంగా వుందని చెప్పారు. ప్రస్తుతం 12 డిసీజ్ ప్రివెన్షన్ సెంటర్స్ అందుబాటులో వున్నట్లు చెప్పారు. పెద్ద కంపెనీలు ఈ మొబైల్ స్క్రీనింగ్ క్లినిక్‌ల ద్వారా లబ్ది పొందుతాయని చెప్పారు. వారాంతాల్లో రోజులో ఇరవై నాలుగు గంటలూ ఈ సేవలు అందించేందుకు సిద్ధంగా వున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







