సౌదీలో తగ్గనున్న వ్యాట్ రేటు!
- May 26, 2022
సౌదీ: 2020లో 15 శాతానికి పెంచిన విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రేటును తగ్గించడాన్ని పరిశీలిస్తున్నట్లు సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహ్మద్ అల్-జదాన్ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా చమురు డిమాండ్ తగ్గడంతో చమురు ధరల పతనం అయ్యాయని, దీని నుంచి ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు VAT రేటును పెంచాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున వ్యాట్ తగ్గింపును పరిశీలిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఆర్థిక స్థిరత్వం కొనసాగించేందుకు.. చమురు నిల్వలు దేశ స్థూల దేశీయోత్పత్తిలో నిర్దిష్ట శాతం స్థాయి కంటే తగ్గకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జదాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







