పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌ని తెగ ఇంప్రెస్ చేసేసిన పాయల్ రాజ్‌పుత్

- May 26, 2022 , by Maagulf
పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌ని తెగ ఇంప్రెస్ చేసేసిన పాయల్ రాజ్‌పుత్

పాయల్ రాజ్‌పుత్.. ఒక్క సినిమాతో ఈ పేరు తెగ మార్మోగిపోయింది. అందుకు కారణం ఆ సినిమాలో అమ్మడి బోల్డ్ పర్‌ఫామెన్సే. అదే ‘ఆర్ఎక్స్ 100’ మూవీ. యూత్‌లో మంచి క్రేజ్ దక్కించుకున్న మూవీ ఇది. సూపర్ డూపర్ హిట్ అందుకోవడంతో పాటు, హీరోయిన్‌గా నటించిన పాయల్ రాజ్‌పుత్‌కీ మంచి క్రేజ్ వచ్చింది ఈ సినిమాతో.

అయితే, అంతంత మాత్రం అవకాశాలతోనే పాయల్ సరిపెట్టుకోవల్సి వస్తోంది. ఆ మధ్య విక్టరీ వెంకటేష్ సరసన ‘వెంకీ మామ’ సినిమాలో నటించింది. అలాగే మాస్ రాజా రవితేజతో ‘డిస్కో రాజా’ సినిమాలో నటించింది. అది చాలదు. ఇంకా కావాలి. స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకోవాలంటే. ఆ దిశగానే పాయల్ ప్రయత్నాలున్నా.. ఫలించడం లేదు.

తాజాగా ఓ టీవీ షోలో పాయల్ రాజ్‌పుత్ ప్రత్యక్షమైంది. సింగిల్‌గా కాదు, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఓ రొమాంటిక్ ఫర్‌ఫామెన్స్ ఇచ్చింది. నిజంగానే ఆ ఫర్‌ఫామెన్స్ చాలా బాగుంది. ఆ సందర్భంగానే, తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమనీ చెప్పుకొచ్చింది.

అలాగే, తనకిష్టమైన సాంగ్ ఏంటంటే, ఠక్కున ‘భీమ్లా నాయక్’ సాంగ్ అని చెప్పేసింది. ఆ సాంగ్‌కి గ్రేస్ ఫుల్‌గా డాన్సులు కూడా వేసేసింది. డాన్స్ అందరూ చేస్తారు. కానీ, ఆ సాంగ్‌కి పర్‌ఫామ్ చేసే సమయంలో పాయల్ హావభావాలు చూడాలి.. కెవ్వు కేక. పవన్‌పై ఆమెకున్న జెన్యూన్ అభిమానం కనిపించింది. అలా పవన్ ఫ్యాన్స్ అటెన్షన్‌ని క్యాచ్ చేయగలిగిందీ బోల్డ్ బ్యూటీ.

ఏమో భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం కూడా దక్కించుకుంటుందేమో పాయల్ చూడాలి. ఇక,  ప్రస్తుతం మంచు విష్ణు వర్ధన్‌తో ‘గాలి నాగేశ్వరరావు’ సినిమాలో పాయల్ నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com