నందమూరి వారసుడు వచ్చేస్తున్నాడహో.!

- May 26, 2022 , by Maagulf
నందమూరి వారసుడు వచ్చేస్తున్నాడహో.!

ఇదిగో వస్తాడట.. అదిగో వస్తాడట.. ఆ సినిమాతో ఎంట్రీ ఇస్తాడట.. లేదు లేదు ఈ సినిమాతోనే ఇంట్రడ్యూస్ అవుతాడట.. అంటూ నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై వచ్చిన గాసిప్పు వార్తలు అన్నీ ఇన్నీ కావు.

కానీ, అవన్నీ జస్ట్ గాలి వార్తలుగానే మిగిలిపోయాయ్. తాజాగా మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీ సోదిలోకి వచ్చింది. ఈ సారి ముహూర్తం డేట్ కూడా ఫిక్సయిపోయిందండోయ్. మే 28న మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం ఫిక్స్ చేసేశారట. ఆ రోజే, మోక్షజ్ఞ సినిమాని అనౌన్స్ చేయనున్నారనేది తాజా అప్‌డేట్.

ఇంతకీ మోక్షజ్ఞను డైరెక్ట్ చేయబోయేది ఎవరు.? నందమూరి ఫ్యామిలీ డైరెక్టర్‌గా పిలవబడే బోయపాటి శీనునా.? లేక ఇంకెవరైనా కొత్త డైరెక్టర్‌ని బాలయ్య దించబోతున్నాడా.? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

కాగా, బాలయ్య సూపర్ హిట్ మూవీ ‘లెజెండ్’ టైమ్‌లోనే మోక్షజ్ఞ ఎంట్రీ వుండబోతుందన్న ప్రచారం జరిగింది. కానీ జరగలేదు. అదే టైమ్‌లో బాలయ్య రెట్రో సూపర్ హిట్ ‘ఆదిత్య 369’ మూవీని ‘ఆదిత్య 999’ పేరుతో సీక్వెల్‌గా రూపొందించబోతున్నారనీ, ఈ సినిమాతోనే నందమూరి వారసుడి తెరంగేట్రం వుండబోతోందన్న ప్రచారం కూడా జరిగింది.  అదీ కుదరలేదు.

ఒకానొక టైమ్‌లో మోక్ఝజ్ఞకు అసలు సినిమాలంటే ఇంట్రెస్టే లేదనీ, హీరో అవ్వాలన్న ఆసక్తి లేదని కూడా ప్రచారం జోరందుకుంది. ఎట్టకేలకు మళ్లీ మోక్షజ్ఞ హీరోయిజంపై టాపిక్ రైజ్ అయ్యింది. ఈ సారి ఇంకాస్త ముందడుగేసి ముహూర్తం (మే 28)తో సహా పక్కాగా తెరపైకి వచ్చాడు. లెట్స్ వెయిట్ అండ్ సీ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com