దుబాయ్ ట్రాఫిక్ జరిమానాలు కట్టకపోతే ఏమి జరుగుతుంది???
- May 26, 2022
ప్రశ్న: నేను దుబాయ్ లో నివసిస్తున్నాను.నాకు భారీ మొత్తంలో ట్రాఫిక్ జరిమానాలు ఉన్నాయి కానీ నేను వాటిని కట్టలేని స్థితిలో ఉన్నాను.నా వాహనం యొక్క రిజిస్ట్రేషన్ రెన్యువల్ కాల పరిమితి మూడు నెలలు మాత్రమే.ఒక వేళ నేను జరిమానాలు కట్టకపోతే ఏమి జరుగుతుంది?
సమాధానం: దుబాయ్ లో ఒక వ్యక్తి ట్రాఫిక్ జరిమానాలు కట్టకపోతే , అతను లేదా ఆమె వాహన రిజిస్ట్రేషన్ యొక్క కాల పరిమితిని పునరుద్దరణ చేసేందుకు రోడ్లు మరియు రవాణా సంస్థ (RTA) అంగీకరించదు. అలాగే ఈ కేసును దుబాయ్ యొక్క ట్రాఫిక్ విచారణా సంస్థకు బదిలీ చేయడం జరుగుతుంది, కేసు యొక్క స్థాయిని బట్టి ఆ సంస్థ వాయిదాల పద్దతిలో జరిమానా కట్టడానికి అనుమతిస్తుంది లేదా సదరు దివాళా తీసిన వ్యక్తి అభ్యర్థన మన్నించి జరిమానా మాఫీ చేయడానికి కూడా అనుమతిస్తుంది.
దుబాయ్ పోలీసులు జరిమానా వాయిదాల సేవలు(Fines Instalment services)అనే పథకాన్ని ప్రవేశపెట్టారు, దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే డ్రైవర్లు తమ ట్రాఫిక్ జరిమానాలను వడ్డీ లేని వాయిదాల పద్దతిలో చెల్లింపు చేయడం.వారు 3 నెలలు , 6 నెలలు లేదా 12 నెలల వాయిదాల కాల వ్యవధిని ఎంచుకోవచ్చు.అలాగే, యూఏఈ బ్యాంకులో ఖాతా ఉంటే ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చు.ఉల్లంఘనల కనీస విలువ తప్పనిసరిగా Dh5,000 ఉండాలి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







