300 నకిలీ బ్యాగులను ధ్వంసం చేయండి: బహ్రెయిన్ కోర్టు

- May 29, 2022 , by Maagulf
300 నకిలీ బ్యాగులను ధ్వంసం చేయండి: బహ్రెయిన్ కోర్టు

బహ్రెయిన్ : 300 కంటే ఎక్కువ దిగుమతి చేసుకున్న మహిళల బ్యాగులు, ఇతర వస్తువులను ధ్వంసం చేయాలని బహ్రెయిన్ కోర్టు ఆదేశించింది. అవి నకిలీ ఉత్పత్తులని కోర్టు పేర్కొంది. బహ్రెయిన్‌లో రిజిస్టర్ చేయబడిన ప్రసిద్ధ బ్రాండ్‌లలో ఒకదానికి ఈ బ్యాగ్‌లు కాపీ అని హై అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ తెలిపింది. ఉత్పత్తులు రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్ మాదిరిగానే ట్రేడ్‌మార్క్ ను కలిగి ఉన్నాయని, ఇది ప్రజలను మోసం చేయడమేనని కోర్టు అభిప్రాయపడింది. సదరు ట్రేడ్‌మార్క్ ని కలిగి ఉన్న కంపెనీ వెంటనే తమ ఉత్పత్తుల విడుదలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com