అరబ్ సమావేశాల ఆవశ్యకతను తెలిపిన ప్రీమియర్
- April 07, 2016
ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, ఎకానమీతోపాటు పాలిటిక్స్ సమర్థవంతంగా ఉండాలనీ, అది గ్లోబల్ డెసిషన్ మేకింగ్ ప్రోసెస్ని ప్రభావితం చేయగలవని అన్నారు. అరబ్ ఫైనాన్స్ మినిస్టర్స్ మరియు గవర్నర్స్ (అరబ్ సెంట్రల్ బ్యాంక్స్)ను ప్రీమియర్ గుడైబియా ప్యాలెస్లో రిసీవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రీమియర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని పార్టీలు అరబ్ ప్రపంచంపై ఫోకస్ పెట్టాయనీ, ఇబ్బందికర పరిస్థితులను గమనిస్తున్నాయనీ, అరబ్ సమాజ భద్రత, మరియు ఎకానమీపై వాటి ప్రభావంపై కొంత ఆందోళన ఉందని, అరబ్ డెసిషన్ మేకర్స్, ఆ విభాగాలపై ప్రత్యేకమైన దృష్టిపెట్టాలని కోరారు. అరబ్ సీనియర్ అధికారుల మధ్య సమావేశాలు నిరంతరం జరుగుతూ సమస్యలపై చర్చించుకోవాలని ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరల పతనంపై అధ్యయనం చేసి, తగు చర్యలు తీసుకోవాలని అరబ్ సమాజానికి ప్రీమియర్ విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







