'వన్ మిలియన్ వర్కింగ్ అవర్స్' తో 600 మందికి ప్రయోజనం

- May 31, 2022 , by Maagulf
\'వన్ మిలియన్ వర్కింగ్ అవర్స్\' తో 600 మందికి ప్రయోజనం

మస్కట్: వివిధ విద్యా అర్హతలు కలిగిన 600 మందికి పైగా యువత 'వన్ మిలియన్ వర్కింగ్ అవర్స్'  కార్యక్రమం నుండి ప్రయోజనం పొందుతారని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పార్ట్ టైమ్ సిస్టమ్‌లో 309,778 పని గంటల లభ్యతను కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీని ద్వారా వివిధ విద్యా అర్హతలు కలిగిన 644 మంది వ్యక్తులు 'వన్ మిలియన్ వర్కింగ్ అవర్స్' తో ప్రయోజనం పొందుతారు. ఈ ప్రోగ్రామ్ సుల్తానేట్‌లోని వివిధ గవర్నరేట్‌లలోని ప్రభుత్వ సంస్థల్లో మొత్తం ఒక మిలియన్ గంటల పార్ట్ టైమ్ పనిని అందించనుంది. 'వన్ మిలియన్ వర్కింగ్ అవర్స్' కార్యక్రమానికి సంబంధించిన ఉత్తర్వులను మే 25, 2021న సుల్తాన్ హైతం బిన్ తారిక్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.          

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com