సీజన్ 6 కోసం సమంతతో మంతనాలు నిజమేనా బిగ్‌బాస్.?
- June 02, 2022
మొన్నీ మధ్యనే ఓటీటీ బిగ్‌బాస్ దుకాణం కట్టేసింది. లేడీ కంటెస్టెంట్ బిందు మాధవికి టైటిల్ కట్టబెట్టి, హిస్టరీ క్రియేట్ చేసేశామని డప్పు కొట్టేసుకుంది. ఆ సీజన్ అలా పూర్తి కాగానే, బుల్లితెరపై ఆరో సీజన్ బిగ్‌బాస్ అలజడి మొదలెట్టేసింది బిగ్‌బాస్ అండ్ టీమ్.
ఆల్రెడీ ఈ సీజన్‌కి సంబంధించి ఓ చిన్నపాటి ప్రోమోతో కూడిన అప్డేట్ కూడా రిలీజ్ చేసేశారు. ప్రోమోను బట్టి, ఈ సీజన్‌కి కూడా నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తాడని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే, తాజాగా హోస్ట్ విషయమై ఇంకో అప్డేట్ తెరపైకి వచ్చింది.
అదే ఆరో సీజన్ హోస్ట్ నాగార్జున కాదట. అక్కినేని మాజీ కోడలు సమంత అని ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ సమంతతో బిగ్‌బాస్ టీమ్ మంతనాలు మొదలెట్టేశారనీ మాట్లాడుకుంటున్నారు. అందుకోసం భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట సమంతకి.
అయితే, బిగ్‌బాస్ హోస్టింగ్ అంటే అంత ఆషా మాషీ కాదు, ప్రతీ వీకెండ్స్‌లోనూ ఖచ్చితంగా అందుబాటులో వుండాలి. దాదాపు మూడు నెలలు దాని కోసం లాక్ అయిపోవల్సిందే. కానీ, సమంత చేతిలో ప్రస్తుతం చాలా చాలా సినిమాలున్నాయ్. బిజీ షెడ్యూల్స్ ఆల్రెడీ ప్లాన్ చేసుకుంది సమంత.
ఈ సిట్యువేషన్లో బిగ్‌బాస్ హోస్టింగ్ సాధ్యమేనా.? గతంలో నాగార్జున ఆబ్సెంట్ అయినప్పుడు ఒక వారం ఆ ప్లేస్‌ని రీప్లేస్ చేసింది సమంత హోస్ట్‌గా. తనదైన క్యూట్ అప్పీల్‌తో సమంత బాగానే హ్యాండిల్ చేసింది ఆ ఎపిసోడ్‌ని. సో అది దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్ ఫ్యాన్స్ సమంత హోస్టింగ్‌ని మళ్లీ కోరుకుంటున్నారట. ఖచ్చితంగా అది జరిగే పని కానే కాదు. కానీ, గుర్రం ఎగరా వచ్చు. చూడాలి మరి.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: ఫైనల్ చేరిన భారత్
- సౌదీ అరేబియాలో కియా స్పోర్టేజ్ వాహనాలు రీకాల్..!!
- బహ్రెయిన్ ఢిఫెన్స్ సిబ్బందిని ప్రశంసించిన కింగ్ హమద్..!!
- కువైటీ చైల్డ్ మర్డర్ కేసు.. డొమెస్టిక్ వర్కర్ కు మరణశిక్ష..!!
- దుబాయ్ లో 15 కి.మీ. సెల్ఫ్-డ్రైవింగ్ జోన్ ఆవిష్కరణ..!!
- మహ్దా హనీ అండ్ డేట్స్ ఫోరం ప్రారంభం..!!
- ఖతార్ లో కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ..!!
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!