ప్రాజెక్టులు, పర్యాటక ప్రాంతాలను సందర్శించిన మహ్మద్ బిన్ జాయెద్
- June 05, 2022
యూఏఈ: షార్జా ఎమిరేట్‌లోని ఖోర్ ఫక్కన్, అల్ దైద్ నగరాల్లో అనేక ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు, పర్యాటక ప్రదేశాలను ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సందర్శించారు. పర్యటనలో భాగంగా అల్ దైద్ కోటను కూడా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సందర్శించారు. ఇది 1820 నాటిది.. అల్ దైద్ నగర పురాతన చరిత్రకు సాక్ష్యంగా ఉంది. ఈ పర్యటనలో ఖోర్ ఫక్కన్ నగరంలో అల్ రఫీసా డ్యామ్ వంటి అనేక ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రెసిడెంట్ సందర్శించారు. ఇవి దేశంలోని అత్యంత ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉన్నాయి. యూఏఈ అధ్యక్షుడు షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వెంట ఉప ప్రధాన మంత్రి, అధ్యక్ష వ్యవహారాల మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రత్యేక వ్యవహారాల సలహాదారు షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్ ఉన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







