చర్చి పై ఉగ్రవాదులు దాడి..50 మంది మృతి

- June 06, 2022 , by Maagulf
చర్చి పై ఉగ్రవాదులు దాడి..50 మంది మృతి

నైజీరియా: నైజీరియాలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. ఆదివారం చర్చీలో కాల్పులు, బాంబు పేలుళ్ల సృష్టించారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయి ఉంటారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో చర్చి స్థలం భయానకంగా మారింది.

ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనల కోసం చర్చీకి వచ్చారు. చర్చి ప్రధాన పాస్టర్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.

ఈ ఘటనలో 50 మంది మృతి చెంది ఉంటారని స్థానిక శాసన సభ్యులు టిమిలెయిన్ వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య అధికంగానే ఉండవచ్చని అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com