ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల
- June 06, 2022
అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. మార్కుల రూపంలో ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాలను http://www.results.bse.ap.gov.inలో చూడవచ్చు. ఈ ఫలితాల్లో 4.14 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 67.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా బాలికలదే పైచేయి సాధించారు. బాలికలు 70.70 శాతం, బాలురు 64.02 శాతం ఉత్తీర్ణత సాధించారు. 78.3 శాతంతో ప్రథమ స్థానంలో ప్రకాశం జిల్లా నిలువగా.. 49.7శాతంతో అత్యల్ప స్థానంలో అనంతపురం జిల్లా నిలిచింది. వచ్చే నెల 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని మంత్రి బొత్స తెలిపారు.
గతంలో మాదిరే ఈసారీ విద్యార్థులకు వచ్చిన మార్కులనే వెల్లడిస్తారు. గ్రేడింగ్ పద్ధతిని తీసేశారు. విద్యాశాఖ ర్యాంకులనూ ప్రకటించదు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు కూడా తమ దగ్గర చదువుకున్న విద్యార్థులకు ఫలానా ర్యాంకులు వచ్చాయని ప్రచారం చేయకూడదని, అలా చేస్తే కనీ సం మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని ఇప్పటికే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!







