ఐదు దేశాల్లో ‘మక్కా రూట్’ ప్రారంభించిన సౌదీ అరేబియా

- June 06, 2022 , by Maagulf
ఐదు దేశాల్లో ‘మక్కా రూట్’ ప్రారంభించిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ‘మక్కా రూట్’ కార్యక్రమాన్ని ఐదు దేశాల్లో ప్రారంభించింది. పాకిస్తాన్, మలేసియా, ఇండోనేసియా, మొరాకో మరియు బంగ్లాదేశ్‌లలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019 నుంచి ప్రారంభమైన కార్యకర్రమం ఈసారి కూడా కొనసాగిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆయా దేశాలకు చెందిన యాత్రీకులకు మక్కా యాత్ర కల్పించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో వీసా జారీ చేయడం, ఎయిర్ పోర్టు వద్ద ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ప్రక్రియలూ సజావుగా సాగేలా చేయడం, వైద్య పరమైన అవసరాలు, జాగ్రత్తలు.. ఇవన్నీ చూసుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com