జీహెచ్ఎంసీ బిజెపి కార్పొరేటర్లతో ముగిసిన ప్రధాని మోడీ భేటీ
- June 07, 2022
న్యూ ఢిల్లీ: ప్రధాని మోడీ ఈరోజు మంగళవారం జీహెచ్ఎంసీ బిజెపి కార్పొరేటర్లతో ఢిల్లీ లో భేటీ అయ్యారు. సాయంత్రం 4గంటలకు కార్పొరేటర్లతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి అర్బన్, గ్రామీణం, మేడ్చల్ అర్బన్, గ్రామీణం, సికింద్రాబాద్, సెంట్రల్ జిల్లా అధ్యక్షులు మోడీ తో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా వీరితో మోడీ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లకు మోదీ నుంచి ఆత్మీయ పలకరింపు దక్కింది. ప్రతి కార్పొరేటర్ వద్దకు వచ్చిన మోదీ వారి వివరాలు, వారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారి పిల్లలు, విద్యాభ్యాసం తదితరాలను కూడా మోదీ అడిగి తెలుసుకున్నారు.
ప్రధాన మంత్రి హోదాలో ఉన్న నేత నుంచి ఈ తరహా పలకరింపు ఎదురయ్యేసరికి జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. గడచిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటారని కార్పొరేటర్లను మెచ్చుకున్న మోదీ… త్వరలో రానున్న ఎన్నికల్లో మరింత మేర సత్తా చాటాలని సూచించారు. పార్టీ అండగా ఉంటుందని, హైదరాబాద్‌లో బీజేపీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని ఆయన కార్పొరేటర్లను కోరారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష







