బస్ స్టాపుల్లో పార్కింగ్: 2,000 దిర్హాముల జరిమానా

- June 07, 2022 , by Maagulf
బస్ స్టాపుల్లో పార్కింగ్: 2,000 దిర్హాముల జరిమానా

యూఏఈ: మోటరిస్టులకు హెచ్చరిక. బస్ స్టాపుల్ని వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తే, అలాంటివారికి జరిమానాలు తప్పవు. ఈ మేరకు అబుదాబీ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించి బస్ స్టాపుల్లో వాహనాల్ని పార్క్ చేస్తే, 2,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. ఈ మేరకు ఇన్‌స్టగ్రామ్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు అధికారులు. పిక్ అప్ మరియు డ్రాపింగ్ కోసం ప్రయాణీకులకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాల్ని కేటాయించడం జరిగింది. అక్కడ మాత్రమే వాహనాల్ని వాహనదారులు నిలపాల్సి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com