పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- June 08, 2022
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో ప్రస్తుతం కరెంటుకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న విధంగానే శనివారాన్ని సెలవు దినంగా పునరుద్ధరించింది. తద్వారా విద్యుత్, ఇంధనం పెద్ద ఎత్తున ఆదా అవుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని షాబాజ్ షరీఫ్ అధ్యక్షతన కాబినెట్ భేటీ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు విద్యుత్ ఆదా చేసేందుకు శనివారాన్ని పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. గతంలోనూ ఈ విధానం అమల్లో ఉండేది. దీన్ని మళ్లీ అమల్లోకి తీసుకురావాలని కాబినెట్ నిర్ణయించింది.
దీనిపై పాక్ సమాచార ప్రసార శాఖ మంత్రి మరియం ఔరంగజేబ్ మాట్లాడుతూ.. శనివారాన్ని సెలవు దినంగా పునరుద్ధరించడం వల్ల సాలీనా 386 మిలియన్ డాలర్లు ఆదా అవుతుందని, 77 బిలియన్ డాలర్ల మేర దిగుమతి రంగానికి ఊరట కలుగుతుందని వివరించారు. అంతేకాకుండా, శుక్రవారాన్ని వర్క్ ఫ్రం హోం దినంగా ప్రకటించాలని ఇంధన రంగం సిఫారసు చేసిందని, ఒక్కరోజు ప్రజలు ఇంటి వద్ద నుంచి పనిచేయడం వల్ల ఎంతో ఇంధనం ఆదా అవుతుందని వివరించారు.
అయితే, ఈ సిఫారసు సాధ్యాసాధ్యాలపై ప్రధాని షాబాజ్ షరీఫ్ ఓ కమిటీ ఏర్పాటు చేశారని మరియం ఔరంగజేబ్ తెలిపారు. దాంతోపాటు, మార్కెట్లను వీలైనంత త్వరగా మూసివేయడం వల్ల కూడా విద్యుత్ ఆదా చేయవచ్చన్న ప్రతిపాదనలు క్యాబినెట్ సమావేశంలో తెరపైకి వచ్చాయని వివరించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







