వర్షంలో డ్రైవింగ్ చేస్తూ ఫోటోలు తీయడం మానాలి

- April 08, 2016 , by Maagulf
వర్షంలో డ్రైవింగ్ చేస్తూ ఫోటోలు తీయడం మానాలి

వర్షం కురుస్తున్న పరిస్థితుల్లో వాహనదారులు వేగంగా నడపకుండా జాగ్రత్తగా వెళ్ళాలని, అలాగే   ఫోటోలను తీయకూడదని కతర్ వాతావరణ శాఖ సూచించింది  వర్షం వచ్చే అవకాశం దృష్ట్యా  శుక్రవారం రాత్రి వరకు కతర్ వాతావరణ శాఖ దేశ నివాసులను కోసం   సాధారణ భద్రతకు చిట్కాలు జారీ చేసింది . " ఉరుములతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు, త్వరగా  ఇంటికి వెళ్లి పొవడానికి ప్రయత్నించండి. ఒక వేళ  మీరు వాహానాన్ని  డ్రైవింగ్ చేస్తూ ఉంటే , ఒక సురక్షిత స్థానంలో మీ కారుని ఆపండి. కారు కిటికీ అద్దాలు మూసి ఉంచడం  మంచిది.ఉరుములు తగ్గింతవరకు ఇలా చేయండని " ప్రజలకు సలహా చెప్పారు.బలమైన గాలులు ,ఉరుములతో కూడిన వాతావరణ  పరిస్థితులు మరియు ఎత్తుగా ఎగిసిపడే కెరటాలు  అస్థిర వాతావరణం నెలకొని ఉన్నప్పుడు ఆ సమయంలో  సముద్రం లోనికి  ప్రవేశించకుండా  నివారించాలని  ప్రజలకు వాతావరణ శాఖ సూచించింది,వాతావరణ శాఖ తాజా వాతావరణం నవీకరణలను మరియు హెచ్చరికలు తెల్సుకోవాలంటే అధికారిక వెబ్సైట్ మరియు వివిధ సామాజిక మీడియా ఖాతాల ద్వారా అనుసరించవచ్చని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com