రిసార్ట్ లో సింహాలు.. సౌదీ వ్యక్తికి 10 ఏళ్ల జైలు
- June 09, 2022
జెడ్డా: రియాద్‌లోని తన ప్రైవేట్ రిసార్ట్ లో మూడు సింహాలను అక్రమంగా ఉంచినందుకు సౌదీ వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష, SR30 మిలియన్ ($ 8 మిలియన్) జరిమానా విధించబడుతుంది. రిసార్ట్ లో మూడు సింహాలను ఉంచినట్లు సమాచారం అందడంతో నేషనల్ సెంటర్ ఫర్ వన్యప్రాణుల బృందం, పర్యావరణ భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దళాలు రిసార్టుపై రైడ్ చేసి సింహాలను గుర్తించారు. ఇది దేశ పర్యావరణ వ్యవస్థను ఉల్లంఘించిన నేరంగా పరిగణించబడుతుందని అధికారులు తెలిపారు. సింహాలను జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. దేశంలోని వన్యప్రాణులను సంరక్షించడానికి, రాజ్యంలో వేటను నియంత్రించడానికి సౌదీ పర్యావరణ, నీరు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ కఠినమైన కార్యనిర్వాహక నిబంధనలను అమలు చేస్తోంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







