చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వలసదారుల అరెస్ట్

- June 09, 2022 , by Maagulf
చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వలసదారుల అరెస్ట్

మనామా: లేబర్ మార్కెట్ స్థిరత్వం కోసం, చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వలసదారుల్ని ఏరివేసే పక్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు వలసదారుల్ని అరెస్ట్ చేశారు. వారిపై డిపోర్టేషన్ సంబంధిత చర్యలు తీసుకుంటున్నారు. నేషనాలిటీ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్, ముహరాక్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ సంయుక్తంగా ఈ ఆపరేషన్స్ నిర్వహించడం జరుగుతోంది. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ నిబంధనల్ని వలసదారులు ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రతి వారం తనిఖీలు జరుగుతాయనీ, ఉల్లంఘనుల్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com