హజ్ మోసాలపై సౌదీ అరేబియా హెచ్చరిక
- June 09, 2022
జెడ్డా: సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, సోషల్ మీడియా వేదికగా హజ్ సేవలకు సంబంధించి జరిగే మోసాలపై యాత్రీకులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేసింది. తక్కువ ధరలకే హజ్ యాత్ర.. అంటూ జరిగే ప్రచారాల్ని విశ్వసించరాదని సూచించింది. పలు ఫేక్ సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా యాత్రీకుల్ని మోసం చేస్తున్నారంటూ మినిస్ట్రీ హెచ్చరించింది. వ్యక్తులు తమ వ్యక్తిగత సమాచారారన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికారిక వ్యక్తులకు ఇవ్వకూడదని పేర్కొంది.తమ అధికారిక యాప్ ఈత్మర్నా అలాగే అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే హజ్ మరియు ఉమ్రా సేవలు పొందవచ్చు. మోసాలకు పాల్పడే వ్యక్తులు, సోషల్ మీడియా అక్కౌంట్లపై సమాచారాన్ని సంబంధిత అథారిటీస్‌కి అందించాలని కోరింది మినిస్ట్రీ. ఈ ఏడాది సుమారుగా 1 మిలియన్ యాత్రీకుల్ని అనుమతించనున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







