తెలంగాణ కరోనా అప్డేట్

- June 13, 2022 , by Maagulf
తెలంగాణ కరోనా అప్డేట్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో మరోసారి 100కు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13వేల 015 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 126 మందికి పాజిటివ్ గా తేలింది. హైదరాబాద్ లో అత్యధికంగా 75 కేసులు వచ్చాయి. ఒక్కరోజు వ్యవధిలో మరో 49 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.

నేటివరకు రాష్ట్రంలో 7లక్షల 94వేల 584 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 89వేల 357 మంది కోలుకున్నారు. కరోనా కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు సంఖ్యా పెరుగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,116కి పెరిగింది. నేటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 13వేల 254 కరోనా పరీక్షలు చేయగా.. 129 మందికి పాజిటివ్ గా తేలింది.

కాగా, వందకు పైనే కరోనా కేసులు నమోదవడం ఇది వరుసగా 6వ రోజు. జూన్ 6వ తేదీన 65 కరోనా కేసులు నమోదవగా.. జూన్ 7న 119 కేసులు వచ్చాయి. జూన్ 9న 122 కేసులు, జూన్ 10న 155 కేసులు, జూన్ 11న 145 కేసులు, జూన్ 12న 129 కేసులు వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com