ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించుకున్న డిస్నీ స్టార్,వయాకామ్18..
- June 14, 2022
ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించున్నది వీరే అంటూ బీసీసీఐ సెక్రటరీ జైషా తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. 2023 సంవత్సరం నుంచి ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ టీవీ హక్కులు డిస్నీస్టార్ దక్కించుకుంది. డిజిటల్ హక్కులు రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్ 18 దక్కించుకుంది. భారీ పోటీ నడుమ భారీ మొత్తానికి ఐపీఎల్ మీడియా హక్కులను ఈ రెండు సంస్థలు దక్కించుకున్నాయి. ఫలితంగా ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకు రూ. 48,390 కోట్ల భారీ మొత్తంలో సమకూరినట్లయింది.
తాజా సమాచారం ప్రకారం.. 2023 నుంచి 2027 సంవత్సరాలకు గాను నాలుగు ప్యాకేజీలుగా విభజించిన ఐపీఎల్ మీడియా హక్కులలో టీవీ ప్రసారాలను స్టార్ ఇండియా రూ. 23,575 కోట్లతో దక్కించుకుంది. అదేవిధంగా రిలయన్స్ నేతృత్వంలోని వయాకామ్18 డిజిటల్ హక్కులను రూ. 23,758 కోట్లతో దక్కించుకుందని. అయితే డిజిటల్ హక్కులలో వయాకామ్ తో పాటు టైమ్స్ ఇంటర్నెట్ కూడా భాగమైంది. మొత్తంగా నాలుగు ప్యాకేజీల ద్వారా బీసీసీఐకి రూ. 48,390 కోట్ల ఆదాయం చేకూరనుంది. ప్యాకేజీ A, Bకోసం ఐదేళ్లలో 410 మ్యాచ్‌ల కోసం ఒప్పందం ఉంది. 2023-2024లో ఒక్కొక్కటి 74 మ్యాచ్‌లు, 2025-26లో ఒక్కొక్కటి 84 మ్యాచ్‌లు. 2027 ఎడిషన్‌లో 94 గేమ్‌లు ఉంటాయి.
స్టార్ ఇండియా రూ. 23,575 కోట్ల బిడ్‌తో ఇండియా టీవీ హక్కులను గెలుచుకున్నట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నానని.. రెండు సంవత్సరాలు కొవిడ్ ఉన్నప్పటికీ BCCI యొక్క సంస్థాగత సామర్థ్యాలకు ఈ వేలం ప్రత్యక్ష నిదర్శనం అని BCCI కార్యదర్శి జే షా ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







