లైసెన్స్ ఫోర్జరీ చేసిన భారతీయునికి మూడు సంవత్సరాల జైలుశిక్ష
- April 09, 2016
ఒక భారతీయ వ్యక్తి లైసెన్స్ ఫోర్జరీ చేసిన నేరానికి మూడు సంవత్సరాల జైలు శిక్షకు గురయ్యాడు. ఒక నకిలీ సౌదీ బహ్రైని డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ప్రయత్నించిన కేసులో మూడు సంవత్సరాల కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంది వెను వెంటనే అతను తన శిక్షా కాలం పూర్తి కాగానే దేశమునుండి పంపించేస్తారు .28 ఏళ్ల భారతీయ వ్యక్తి బహ్రెయిని డ్రైవింగ్ లైసెన్స్ కోసం ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ వద్ద దరఖాస్తు చేసుకొన్నాడు. ఆ పత్రంతో పాటు తనకు గతంలోనే సౌదీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందని ఆ దరఖాస్తు పత్రంలో పాటు జతపరచి దాఖలు చేశాడు. దీంతో సులువుగానే బహ్రేయినీ డ్రైవింగ్ లైసెన్స్ ఆ వ్యక్తికి జారీ చేయబడింది. , కానీ అతను అందించిన సౌదీ డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను బహ్రెయిన్ అధికారులు సౌదీకి పంపించారు అక్కడ అధికారులు పంపబడిన పత్రాలను క్షుణంగా పరిశీలించిన తర్వాత ఆ వ్యక్తి బహ్రెయిని అధికారులకు సమర్పించినవి నకిలీవని తేలింది. అడ్డ దారులలో లైసెన్స్ పొందాలనే అతని చిట్కా వికటించి బహ్రెయిని పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
తాజా వార్తలు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- 80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!









