సుశాంత్ డెత్ మిస్టరీ: రెండేళ్లయినా పాపం ఆ హీరోయిన్‌కి తప్పని తిప్పలు.!
- June 15, 2022
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసుకు సంబంధించి ముద్దుగుమ్మ రియా చక్రవర్తి పలు ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తమ అభిమాన హీరో మరణానికి కారణం రియా చక్రవర్తే అంటూ, సుశాంత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెని ఓ ఆట ఆడేసుకున్నారు.
తాజాగా సుశాంత్ చనిపోయి రెండేళ్లయిన సందర్భంగా తమ అభిమాన హీరోని గుర్తు చేసుకున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే రియా చక్రవర్తి కూడా సుశాంత్ పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తూ, సుశాంత్‌తో కలిసి వున్న పాత ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దాంతో మళ్లీ రచ్చ మొదలైంది. సైలెంట్‌గా చంపేసి, ఇఫ్పుడు ప్రేమ నటిస్తున్నావా.? అంటూ రియా చక్రవర్తిపై ఫైర్ అవుతున్నారు ఆయన ఫ్యాన్స్. సుశాంత్‌కి డ్రగ్స్ అలవాటు చేసింది రియా చక్రవర్తియే అంటూ అదే టైమ్‌లో ఆమెపై ఆరోపణలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
ఆ విషయమై, రియా అరెస్టయ్యింది కూడా. ఎలాగోలా ఆ కేసు నుంచి బయట పడింది. అయితే, రెండేళ్లయినా సుశాంత్ డెత్ మిస్టరీ వీడనే లేదు సరికదా.. రియా చక్రవర్తికి ఈ లంపాటకం నుంచి విముక్తి లభించడం లేదు. పాపం వీలు చిక్కినప్పుడల్లా, సుశాంత్ ఫ్యాన్స్ రియాని ట్రోల్ చేస్తూనే వున్నారు.
ఆ ఇష్యూతో రియా చక్రవర్తి ఇమేజ్, కెరీర్ రెండూ నాశనమైపోయాయ్. అన్నట్లు తెలుగులో ‘తూనీగా తూనీగా’ సినిమాలో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మే ఈ రియా చక్రవర్తి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!