‘సర్కారు వారు..’ నెట్టింట సందడి చేసేదెప్పుడంటే.!
- June 15, 2022
‘సర్కారు వారి పాట’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయ్యింది. జూన్ 23న ‘సర్కారు వారి పాట’ అమెజాన్ ఓటీటీ ప్రైమ్ వేదికగా రిలీజ్ కానుంది. మే 12న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సర్కారు వారి పాట’ సినిమా తొలుత డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఏం మ్యాజిక్ జరిగిందో ఏమో, సూపర్ హిట్ లిస్టులోకి వెళ్లిపోయింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలయితే చెప్పాయి. కానీ, నిజంగానే ‘సర్కారు వారి పాట’ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిందా.? అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నే అని చెప్పాలి.
ఫస్ట్ డే టాక్ చాలా దారుణంగా నిరాశపరిచింది. ఆ తర్వాత తర్వాత కొద్ది కొద్దిగా ఇంజక్ట్ అయ్యింది. మహేష్ బాబు మాస్ అప్పీల్, కళావతిగా కీర్తి సురేష్ గ్లామర్, సోషల్ మీడియా ట్రెండింగ్.. తదితర క్యాలిక్యులేషన్స్ ‘సర్కారు వారి పాట’ సినిమాని సక్సెస్ బాటలో నడిపించింది.
ఓవరాల్‌గా సూపర్ హిట్ కొట్టేసింది. ఇక, ఇప్పుడు ఓటీటీ వేదికగా, నట్టింట్లోకి రాబోతోంది. ధియేటర్లలో రిలీజై, మంచి టాక్ తెచ్చుకున్న కొన్ని సినిమాలు ఓటీటీలో ఫెయిలయ్యాయ్. అలాగే ధియేటర్లో ఫెయిలైన కొన్ని సినిమాలు ఓటీటీలో మంచి సక్సెస్ రేటు నమోదు చేస్తున్నాయి ఈ మధ్య కాలంలో.
మరి, ఆ క్రమంలో ‘సర్కారు వారి పాట’ ఏ లిస్టులో చేరుతుందో చూడాలిక. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మైత్రీ మూవీస్ బ్యానర్‌తో కలిసి, మహేష్ బాబు తన సొంత బ్యానర్లో నిర్మించిన సంగతి తెలిసిందే. థమన్ మ్యూజిక్ అందించాడు.
తాజా వార్తలు
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!