‘మెట్రో బజార్’ను ప్రారంభించిన ఎల్ & టీ హైదరాబాద్ మెట్రో రైల్
- June 15, 2022
హైదరాబాద్: ప్రయాణీకులతో తమ బంధాన్ని మరింత శక్తివంతం చేసే కార్యక్రమాలలో భాగంగా ఎల్ & టీ మెట్రోరైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (ఎల్ & టీఎంఆర్‌హెచ్‌ఎల్) వినూత్నమైన నేపథ్యం మెట్రో బజార్, ‘షాపింగ్‌ఆన్ ద గో’ తో వచ్చింది.మెట్రో ప్రయాణీకులకు అనుభవపూర్వక షాపింగ్ అనుభవాలను ఇది అందించనుంది.మెట్రోబజార్‌ను నేడు అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ డీజీపీ, ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ మరియు భరోసా, తెలంగాణా స్టేట్–స్వాతి లక్రా, ఐపీఎస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి,ప్రత్యేక అతిథి ఎల్ & టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ & సీఈఓ కెవీబీ రెడ్డి తో పాటుగా ఇతర హెచ్‌ఎంఆర్ అధికారులు పాల్గొన్నారు.మెట్రోబజార్ తొలి సంచికను ‘ఉమెన్ ఎన్విజన్ కౌన్సిల్ ఫర్ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్’ (ఉమెన్విజన్) భాగస్వామ్యంతో నిర్వహించారు.మహిళా వ్యాపారవేత్తలకు సాధికారితను అందించే దిశగా కృషి చేస్తున్నసెక్షన్ 8 కంపెనీ ఉమెన్విజన్.ఈ కార్యక్రమం కోసం ప్రాంగణాన్ని ఖర్చులేని పద్ధతిలో అందించింది.
ఫ్లియా మార్కెట్ రూపంలో మెట్రోబజార్‌ను నిర్వహిస్తున్నారు.అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో కాన్‌కోర్స్ లెవల్ వద్ద 15 జూన్ 2022 నుంచి 15 రోజుల పాటు ఇది జరుగుతుంది.అప్పెరల్, ఆర్ట్‌వర్క్స్, హెర్బల్ ఉత్పత్తులు వంటి వాటిని ఇక్కడ 14 కియోస్క్‌లలో విక్రయిస్తున్నారు.
అడిషనల్ డీజీపీ, ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ మరియు భరోసా, తెలంగాణా స్టేట్-స్వాతి లక్రా, మాట్లాడుతూ "లింగ సమానత్వం, మహిళా సాధికారితను ఈ రీతిలో భారీగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రోత్సహించడం సంతోషంగా ఉంది.మహిళా వ్యవస్థాకతను ప్రోత్సహించడంపై హెచ్ఎంఆర్ లక్ష్యానికి అత్యుత్తమ ఉదాహరణగా మెట్రోబజార్ నిలుస్తుంది.ఈ తరహా కార్యక్రమాలు తమ జీవితంలో ఏదైనా చేయాలని తపించే మహిళలను ప్రోత్సహించడం మరియు వారికి తగిన మార్గాలను అందించడంలో సుదూరం వెళ్తాయి.మెట్రోబజార్‌కు అభినందనలు. ఇక్కడ అందుబాటు ధరలలో అందిస్తోన్న ఉత్పత్తులను మెట్రో ప్రయాణీకులు ఇష్టపడగలరని ఆశిస్తున్నాను..'' అని అన్నారు.
హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో మహిళా వ్యవస్ధాపకతను ప్రోత్సహిస్తూనే, మెట్రో ప్రయాణీకులకు వినూత్నమైన షాపింగ్ అనుభవాలను అందిస్తూ మెట్రోబజార్‌ను ఎల్ & టీఎంఆర్‌హెచ్‌ఎల్ పరిచయం చేసింది.మరింతగా మెట్రో సేవలను వినియోగించేందుకు ఇది ప్రయాణీకులకు స్ఫూర్తి కలిగించనుంది’’ అని అన్నారు.
ఎల్ & టీఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ & సీఈఓ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రయాణీకుల అనుభవాలను మెరుగుపరచాలనే మా నిరంతర ప్రయత్నాలలో భాగమిది.మహిళలకు ఆర్థిక స్వేచ్ఛనందించే రీతిలో ఈ ఎడిషన్ కోసం ఉమెన్విజన్‌తో భాగస్వామ్యం చేసుకున్నాం’’ అని అన్నారు.
ఉమెన్విజన్ ఫౌండర్ డైరెక్టర్ ప్రవీణ తోట నాయుడు మాట్లాడుతూ ‘‘మహిళా వ్యవస్థాపకులకు తోడ్పడే క్రమంలో మొదటి ఎడిషన్ మెట్రోబజార్ కోసం హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎల్& టీఎంఆర్‌హెచ్‌ఎల్ తమతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల ధన్యవాదములు తెలిపారు.

_1655313178.jpg)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!