తెలంగాణ కరోనా అప్డేట్
- June 15, 2022
హైదరాబాద్: తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
దేశవ్యాప్తంగా భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కొవిడ్ కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 205 మందికి కొత్తగా కొవిడ్ సోకింది. 21,070 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలను వైద్యాధికారులు నిర్వహించారు. అయితే కొవిడ్ చికిత్స పొందుతున్న 63 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 99.31శాతం ఉంది.
ఇదిలా ఉంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిన లెక్కల ప్రకారం.. ఒక్క హైదరాబాద్ లోనే 132 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 39, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇక సంగారెడ్డి జిల్లాలో 9, మంచిర్యాల జిల్లాలో మూడు, అదిలాబాద్, నల్గొండ, పెద్దపల్లి, యాద్రాద్రి భవనగిరి జిల్లాలో రెండు చొప్పున, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, హనుమకొండ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,401కి చేరింది. కొవిడ్ ఉధృతి పెరిగే అవకాశం ఉందని, ప్రతిఒక్కరు ఎవరికివారు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!