కొంతమంది ప్రయాణీకులకు హోం చెక్ ఇన్ సర్వీస్ ప్రకటించిన ఎమిరేట్స్
- June 16, 2022
            యూఏఈ: ఇంటి వద్దనే కొందరు ప్రయాణీకులకు హోం చెక్ ఇన్ సర్వీస్ అందించేందుకు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ముందుకొచ్చింది. దుబాయ్, షార్జాకి చెందిన ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులకు ఈ సర్వీస్ ఉచితం. చెక్ ఇన్ ఏజెంట్లు ప్రయాణీకుల ఇళ్ళను సందర్శించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సహా బ్యాగేజీ చెకింగ్ ఇన్, బోర్డింగ్ పాస్‌లు వంటి అంశాలపై సేవలు అందిస్తారు. చివరి నిమిషంలో అదనపు లగేజ్ వుంటే, దానికి సంబంధించి ప్రత్యేక కౌంటర్ కూడా వుంటుంది. వినియోగదారులు ప్రీ బుక్డ్ ఎమిరేట్స్ కాంప్లిమెంటరీ చాఫర్ డ్రైవ్ సర్వీసు ద్వారా వెళ్ళవచ్చు. ఏజెంట్లు లగేజ్ తీసుకుంటారు. కాంప్లిమెంటరీ హోమ్ చెక్ ఇన్ సర్వీస్ కనీసం 24 గంటల ముందుగా బుక్ చేసుకోవాలి. విమానం బయల్దేరడానికి 90 నిమిషాల ముందు విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ కేంద్రానికి ప్రయాణీకులు చేరుకోవాలి. రిజిస్టర్డ్ వినియోగదారులు హ్యాండ్ ఫ్రీ విధానంలో ఇంటిగ్రేటెడ్ బయో మెట్రిక్స్ టన్నెల్ మరియు స్మార్ట్ గేట్ల ద్వారా వెళ్ళవచ్చు.
తాజా వార్తలు
- లండన్‌లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్‌తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







