భారత్ గోధుమలపై నిషేధం.. కువైట్‌కు మినహాయింపు

- June 17, 2022 , by Maagulf
భారత్ గోధుమలపై నిషేధం.. కువైట్‌కు మినహాయింపు

కువైట్ సిటీ: రాబోయే కాలంలో కువైట్‌కు అవసరమైన అన్ని ఆహార ఉత్పత్తులను అందించడానికి భారతదేశం తన పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేసింది. గోధుమలతో సహా ఆహార ఉత్పత్తుల ఎగుమతిపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. కువైట్‌లో భారత రాయబారి సిబి జార్జ్.. వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఫహద్ అల్-షరియాన్‌కు ఒక సమావేశంలో ఈ మేరకు హామీ ఇచ్చారు.కరోనా సమయంలో కువైట్ పోషించిన గొప్ప పాత్రను సిబి జార్జ్ గుర్తుచేసుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో భారతదేశానికి 215 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, వెయ్యికి పైగా ఆక్సిజన్ సిలిండర్లను కువైట్ సరఫరా చేసిన విషయం తెలిసిందే. కువైట్‌కు గోధుమల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసే నిర్ణయంతో సహా, కువైట్‌కు అవసరమైన అన్ని రకాల ఆహార పదార్థాలను సరఫరా చేసేందుకు భారతదేశం సంసిద్ధత వ్యక్తం చేసిందని కువైట్ మంత్రికి భారత రాయబారి తెలిపినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com