ఉత్తమ నూతన విమానాశ్రయంగా బహ్రెయిన్‌కి ప్రత్యేక గుర్తింపు

- June 17, 2022 , by Maagulf
ఉత్తమ నూతన విమానాశ్రయంగా బహ్రెయిన్‌కి ప్రత్యేక గుర్తింపు

బహ్రెయిన్: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రపంచంలోనే అత్యుత్తమ నూతన విమానాశ్రయంగా అరుదైన గౌరవం దక్కింది. స్కైట్రాక్స్ 2022 ప్రపంచ విమానాశ్రయాల అవార్డుల్లో ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది బహ్రెయిన్ విమానాశ్రయం. ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో ప్యాసింజర్ టెర్మినల్ వద్ద జరిగిన అవార్డుల ప్రకటన కార్యక్రమంలో ఈ మేరకు వెల్లడించారు నిర్వాహకులు. గతంలో స్కైట్రాక్స్ రేటింగ్ ప్రకారం బహ్రెయిన్ ఫైవ్ స్టార్ గౌరవం పొందింది. ఈ గౌరవం దక్కించుకున్న మూడో మిడిల్ ఈస్ట్ విమానాశ్రయమిది. కోవిడ్ సేఫ్టీ ప్రికాషన్స్ విభాగంలోనూ ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కించుకుంది. పెరల్ లాంజ్ సైతం ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కించుకుంది. 8 నెలల పాటు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ఎంపికలు జరిగాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com