రోగి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా వైద్యులు సర్జరీ నిర్వహించరు.!

- June 18, 2022 , by Maagulf
రోగి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా వైద్యులు సర్జరీ నిర్వహించరు.!

బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ వైద్యులు, రోగి బంధువుల అనుమతి లేకుండా సర్జరీ నిర్వహించారనీ, ఈ కారణంగా బాధితుడు తీవ్ర అస్వస్థతో ప్రాణాలు కోల్పోయాడంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఖండించడం జరిగింది. సాధారణ పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఆ వ్యక్తికి అతని బంధువుల అనుమతి లేకుండా ఎలాంటి సర్జరీ నిర్వహించలేదని తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్ సహా అనేక అనారోగ్య సమస్యలు ఆ వ్యక్తికి వున్నాయనీ, ఆసుపత్రిలో అతన్ని చేర్చాక, రోగి బంధువుల నుంచి రెండు సార్లు అనుమతి తీసుకుని, వైద్య చికిత్స ప్రారంభించగా, రోగి పరిస్థితి విషమించిందనీ, చివరికి ఆయన ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com