మహిళా పోలీస్ వినూత్న ఆవిష్కరణ

- June 18, 2022 , by Maagulf
మహిళా పోలీస్ వినూత్న ఆవిష్కరణ

యూఏఈ: రస్ అల్ ఖైమా మహిళా పోలీస్, ఓ స్మార్ట్ సిస్టమ్ అభివృద్ధి చేయడం జరిగింది. ఈ సిస్టమ్ ద్వారా డోర్స్ వెనుకాల మనుషులు వున్నారా.? లేదా.? అనేది తేలిగ్గా కనుగొనడానికి వీలవుతుంది. క్రిమినల్స్‌ని లేదా బాధితుల్ని పట్టుకునేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. బాధితుల్ని భద్రంగా బయటకు తీసుకొచ్చేందుకు ఈ సిస్టమ్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. రస్ అల్ ఖైమా పోలీస్ స్పెషల్ టాస్క్స్ డిపార్టుమెంట్ ఫస్ట్ సార్జంట్ అమ్మాన అల్ హజిరి ీ సిస్టమ్ ప్రదర్శించారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో దీన్ని ప్రదర్శించారు. ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టేటప్పుడు, క్రిమినల్స్‌ని పట్టుకోవడం అలాగే బాధితుల్ని రక్షించడానికి ఇలాంటి సాధనాలు ఉపయోగపడతాయని ఉన్నతాధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com