16 శాతం పెరిగిన ఒమన్ జిడిపి
- June 19, 2022
ఒమన్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రస్తుత ధరలలో స్థూల దేశీయోత్పత్తి 2020 చివరినాటికి OMR28.4 బిలియన్లతో పోలిస్తే 2021 చివరి నాటికి 16.1 శాతం పెరిగి OMR33 బిలియన్లకు చేరుకుంది. 2020 చివరినాటికి OMR8.5 బిలియన్లతో పోలిస్తే, 2021 చివరి నాటికి రాష్ట్ర మొత్తం ప్రజా ఆదాయాలు 28.7 శాతం పెరిగి దాదాపు OMR10.9 బిలియన్లకు చేరాయి. అయితే మొత్తం ప్రజా వ్యయం 5.9 శాతం తగ్గి OMR12.2 బిలియన్ కి చేరుకుంది. 2021 చివరి త్రైమాసికంలో విడుదల చేసిన “ఒమన్ సుల్తానేట్‌లో ఆర్థిక పరిస్థితుల విశ్లేషణ” నివేదికలో NCSI జారీ చేసిన డేటా ప్రకారం 2021 చివరి నాటికి రాష్ట్ర సాధారణ బడ్జెట్‌లో నమోదైన లోటు OMR1.2 బిలియన్లుగా ఉన్నట్లు సూచించింది. ప్రస్తుత ధరల ప్రకారం GDPలో 3.7% గా ఉంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







