లైసెన్స్ లేకుండా డ్రైవింగ్.. 87 మంది యువకులు అరెస్ట్

- June 19, 2022 , by Maagulf
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్.. 87 మంది యువకులు అరెస్ట్

కువైట్: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడుపుతున్న 87 మంది యువకులను అరెస్టు చేసినట్లు ఆపరేషన్స్ అండ్ ట్రాఫిక్ విభాగం వెల్లడించింది. వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు పేర్కొంది. ఆపరేషన్స్ అండ్ ట్రాఫిక్ విభాగం ప్రకారం.. ఈ నెల 11 నుండి 17 వరకు మొత్తం 30,217 ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి నోటీసులు జారీ చేయబడ్డాయి. ఇందులో తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన 71 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్లు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com