రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ‘జెడ్ ప్లస్’ భద్రత
- June 22, 2022
ఒడిశా: రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరఫున ఝార్ఖండ్ మాజీ గవర్నర్, గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముర్ముకు కేంద్రం.. జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదికి బుధవారం నుంచి సీఆర్పీఎఫ్ దళాలు భద్రత ఇవ్వనున్నాయి. 14-16 మంది పారామిలిటరీ సిబ్బంది ముర్ముకు సెక్యూరిటీగా ఉంటారని కేంద్రం తెలిపింది.
కాగా, ద్రౌపది ముర్ము బుధవారం ఉదయం.. ఒడిశాలోని రాయ్‌రంగ్‌పుర్‌లో ఉన్న శివాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆమె ఆలయ ప్రాంగణాన్ని చీపురు పట్టి శుభ్రం చేశారు. ఆ తర్వాత దైవ దర్శనం చేసుకున్నారు. జహీరా అనే గిరిజన ప్రార్థన స్థలాన్ని కూడా ఆమె సందర్శించారు. రాజ్యాంగంలో రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు పొందుపరచి ఉన్నాయో.. వాటి ప్రకారమే పనిచేస్తానని ఆమె చెప్పారు.
రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ జూలై 18న జరగనుంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో ముర్ము గెలిస్తే… ఆమె భారతదేశానికి మొదటి గిరిజన రాష్ట్రపతితో పాటు దేశానికి రెండో మహిళా రాష్ట్రపతి అవుతారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







