అన్నయ్య నాకు రాజకీయ ప్రత్యర్థి: పవన్ కల్యాణ్
- April 10, 2016
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవిపై ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనలో చిరంజీవి ఉండరని, తాను అన్నయ్యను ఆహ్వానించనని పవన్ చెప్పారు. చిరంజీవి తనకు అన్నయ్య అయినప్పటికీ రాజకీయ ప్రత్యర్థిగానే తాను భావిస్తానని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నటనపరంగా ఎప్పటికీ అన్నయ్యే ఆదర్శమని పవన్ చెప్పుకొచ్చారు. ఆయన స్థాయిలో నటించడం తనకు సాధ్యం కాదని చెప్పారు. రాజకీయాలపరంగా తన అన్నయ్యతో విభేదాలున్నాయని, వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని పవన్ కల్యాణ్ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







