హజ్ సీజన్ కోసం అదనపు విమానాలు: ఎమిరేట్స్
- June 23, 2022
దుబాయ్: రాబోయే హజ్ సీజన్ కోసం అదనపు విమానాలను నడుపనున్నట్లు ఎమిరేట్స్ ప్రకటించింది. హజ్ సమయంలో పవిత్ర నగరమైన మక్కాకు వెళ్లే యాత్రికుల కోసం మరింత కనెక్టివిటీని పెంచేందుకు వీలుగా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ అదనపు విమానాలను నడపాలని నిర్ణయించింది. జెడ్డాకు 31 అదనపు విమానాలను నడుపనుంది. అలాగే జూన్ 23 నుండి జులై 20 వరకు మదీనాకు డబుల్ డైలీ ఫ్లైట్లను నడపనున్నట్లు ఎమిరేట్స్ తెలిపింది. ఈ అదనపు సేవలు ఎమిరేట్స్ రెగ్యులర్ షెడ్యూల్డ్ సర్వీసులకు సమాంతరంగా నడుస్తాయని పేర్కొంది. చెల్లుబాటు అయ్యే హజ్ వీసాను కలిగి ఉన్న ప్రయాణికులకు ప్రత్యేక సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. యాత్రికులు తప్పనిసరిగా 65 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలని, సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా గుర్తింపు పొందిన వ్యాక్సిన్‌తో చెల్లుబాటు అయ్యే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని, బయలుదేరిన 72 గంటలలోపు నెగిటివ్ PCR పరీక్షను కూడా కలిగి ఉండాలని ఎమిరేట్స్ మరోసారి గుర్తు చేసింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







