ప్రవాస టీచర్ల కు ముఖ్య గమనిక
- June 23, 2022
కువైట్ సిటీ: కువైట్ లోని ప్రవాస టీచర్ల కోసం విద్యా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రవాస ఉపాధ్యాయులు తమ రెసిడెన్సీ పర్మిట్లను రెన్యువల్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ట్రాఫిక్ జరిమానాలు ఉంటే చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.లేనిపక్షంలో రెసిడెన్సీ రెన్యువల్ చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది.ఈ మేరకు అక్కడి స్కూళ్లకు ఓ సర్క్యూలర్ జారీ చేసింది. స్కూళ్లలో పనిచేస్తున్న ప్రవాస టీచర్లు, నాన్-టీచింగ్ సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేయాలని సర్క్యూలర్‌లో పేర్కొంది.అలాగే ప్రవాసులు తమ రెసిడెన్సీ రెన్యువల్ కోసం పాటించాల్సిన నిబంధనలు తెలియజేసింది.
రెసిడెన్సీ రెన్యువల్ కోసం ప్రవాస టీచర్లు పాటించాల్సిన నిబంధనలు..
1. గడువు ముగియడానికి 3 నెలల ముందు రెసిడెన్సీ రెన్యూవ్ చేయబడదు
2. టీచర్లు ముందుగా విద్యాశాఖ వెబ్‌సైట్ https://moe.edu.kw.ద్వారా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి
3. అపాయింట్‌మెంట్‌లో ఇచ్చిన తేదీకి కచ్చితంగా ఎవరైతే తమ రెసిడెన్సీని రెన్యువల్ చేసుకోవాలనుకుంటున్నారో వారే స్వయంగా సంబంధిత కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది
4. రెసిడెన్సీ రెన్యువల్ కోసం కావాల్సిన ధృవపత్రాలు
- స్కూల్ యాజమాన్యం అప్రూవ్ చేసిన Form No. 1, దానిపై స్కూల్ స్టాంప్ తప్పకుండా ఉండాలి.
- ఒర్జినల్ పాస్‌పోర్ట్, సివిల్ ఐడీలతో పాటు వాటి జిరాక్స్ కాపీలు కూడా తీసుకెళ్లాలి.
- ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన కాపీలు(ఒకవేళ ఉంటే).
- కువైట్ లోకి ప్రవేశించిన చివరి స్టాంప్ కాపీ.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







