నాన్-ఖతారీ యాజమాన్యంలో బ్యాంకుల పెంపు.. క్యాబినెట్ ఆమోదం
- June 23, 2022
దోహా: ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ అధ్యక్షతన అమిరి దివాన్లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రి ప్రతిపాదన ఆధారంగా స్టాక్ ఎక్స్ఛేంజ్లో లీస్ట్ అయిన కొన్ని బ్యాంకులు, కంపెనీల మూలధనంలో ఖతారీయేతర పెట్టుబడిదారుల యాజమాన్యం శాతాన్ని పెంచడానికి మంత్రివర్గం తాజాగా ఆమోదించింది. ఈ నిర్ణయం ప్రకారం.. ఖతారీయేతర పెట్టుబడిదారు కింద ఉన్న బ్యాంకులు, కంపెనీల మూలధనంలో 100% వరకు పెంచుకునే అవకాశం ఏర్పడనుంది. క్యాబినెట్ తాజా నిర్ణయంతో 1- ఖతార్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ బ్యాంక్, 2- దోహా బ్యాంక్, 3- మెడికేర్ గ్రూప్, 4- ఖతార్ గ్యాస్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ లిమిటెడ్ (నకిలత్), 5- ఖతార్ ఫ్యూయల్ కంపెనీ (వోకోడ్) బ్యాంకులు, కంపెనీలకు లబ్ధి కలుగనుంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







