అబుధాబీలో రెండవ క్యాథలిక్ చర్చి ప్రారంభం
- June 13, 2015
అబుధాబీలోనే రెండవదైన క్యాథలిక్ చర్చి, ఈ మంగళవారం సాయంత్రం యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ యొక్క సాంస్కృతిక, యువజన మరియు సామాజిక అభివృద్ధి శాఖమంత్రి - షేక్ బిన్ ముబారక్ అల్ నహ్యన్, వాటికన్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ - కార్డినల్ పెఇత్రొ పరోలిన్ మరియు దక్షణ అరేబియా యొక్క అపోస్తలిక్ మతగురువు బిషప్ పాల్ హిండెర్ గార్ల సమక్షంలో ప్రారంభింపబడింది.
రోమన్ క్యాథలిక్ మత వర్గానికి చెందిన ఈ కొత్త సైంట్ పాల్ చర్చి, అబుధాబీ మునిసిపాలిటీ వారిచే అబుధాబీ ఇండస్ట్రియల్ ఏరియా లోని ముసాఫాలో ఈయబడిన 4,560 చ. మీ. విస్తీర్ణము గల కాంప్లెక్స్‌లో నిర్మింపబడింది.
మొత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇంచుమించు 9,00,000ల మంది క్యాథలీక్ మత విశ్వాసులు ఉండగా, ఇప్పటివరకు, వారిలో 20,000 మందికి మాత్రమే రాజధానిలోని సిటీ సెంటర్లోనున్న ఏకైక క్యాథలీక్ చర్చి ఐన సేంట్ జోసెఫ్స్ క్యాతడ్రల్లో నిర్వహింపబడే చర్చి సేవలలో పాల్గొనేందుకు వీలుండేది.
ముసాఫాలో లేబర్ క్యాంపులు అధికం కావడం, మొహ్మద్ బిన్ జాయెద్ మరియు ఖాలీఫా నగరాల సమీప ప్రాంతాలలోను ఎంతోమంది ప్రజలు నివసిస్తూండడం వలన, అబుధాబీ శివారు ప్రాంతాలలోని క్యాథలిక్ మతస్థులకు ఈ కొత్త సెఇంట్ పాల్ చర్చి ఒక వరమేనని చెప్పవచ్చు.
ఈ ఆవిష్కరణ సందర్భంగా గౌరవనీయులైన షేక్ నహ్యన్ మాట్లాడుతూ, " మా నాయకత్వం యొక్క గొప్పదనం జగద్విదితమే ... ఇంకా, ఈ దేశంలో నివసిస్తున్న అనేక జాతులు, మతాలకు చెందిన ప్రజల మతవిశ్వాసాలను అర్థం చేసుకొని, గౌరవించటం అనే సత్సాంప్రదాయాన్ని మేము అంగీకరిస్తాము. ఆ గొప్ప బాధ్యతను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క నాయకత్వం నెరవేరుస్తోందని తెలియడానికి మీ అందరికి ఇది ఒక మంచి ఉదాహరణ అని భావిస్తున్నాను", అని తెలిపారు.
సెఈంట్ పాల్ చర్చి, క్యాథలీక్ చర్చి యొక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ మరియు యెమన్లలోని టెరిటోరియల్ అధికార పరిధిలో, అబుధాబీలోని బిషప్ పీఠం క్రింద, దక్షణ అరేబియా అపొస్తలిక్ మత నాయకత్వం కిందకు వర్తిస్తుంది.
" యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ ప్రభువుల యొక్క ఉదార స్వభావానికి ఈ కొత్త చర్చి ఒక చక్కని ఉదాహరణ. క్రిస్టియన్లు, తమ మత విశ్వాసాలను అనుసరించడానికి, వారి అస్తిత్వాన్ని నిలబెట్టుకోగలగడం ద్వారా, తాము సమాజంచేత ఆదరింపబడినట్లు భావిస్తున్నారు. ఈవిధమైన సామరస్యపూర్వక, సుహృద్భావ వాతావరణాన్ని కల్పించినందుకు ప్రభువులకు మా అనేక కృతజ్ఞతలు " అని - బిషప్ హిండెర్ తెలియచేశారు.
ఇక చివరగా, ముసాఫా ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక అమెరికన్ క్యాథలిక్ చర్చి నిర్మాణo పూర్తయినప్పటికీ, దాని ప్రారంభించే తేదీ మాత్రం వెల్లడి కాలేదు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







