భారత్ కరోనా అప్డేట్
- June 24, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కొవిడ్ మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. అత్యంత ప్రమాదకరంగా విజృంభిస్తోంది. రోజువారి కేసులు 17 వేలకు పైగా నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 17 వేల 336 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకిన మరో 13 మంది చనిపోయారు. రోజువారి కేసులు నాలుగు నెలల తర్వాత 17 వేలు దాటాయి. కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి కొవిడ్ కేసులు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తెలంగాణలోనూ కొవిడ్ కేసుల సంఖ్య 5 వందలకు చేరువలో ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 496 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గత జనవరి తర్వాత ఇదే అత్యధికం.
కొవిడ్ నుంచి గత 24 గంటల్లో 13 వేల 29 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో ఇప్పటివరకు వైరస్ ను జయించిన వారి సంఖ్య 4 కోట్ల 27 లక్షలకు పైగానే ఉంది. రికవరీ రేటు 98. 59శాతంగా ఉంది. రికవరీల కంటే కొత్త కేసుల సంఖ్య భారీగా పెరగుతుండటంతో యాక్టివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 88 వేల 284 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల కేసుల సంఖ్య 0.20 శాతానికి పెరిగింది.దేశంలో పాజిటివిటి రేట్ ప్రమాదకరంగా కనిపిస్తోంది. రోజువారి పాజిటివిటి రేట్ 4 శాతం దాటడంతో వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







