సోషల్ మీడియాలో అసభ్యకర చర్యలు.. మహిళ అరెస్ట్
- June 25, 2022
బహ్రెయిన్: బహిరంగంగా అసభ్యకర చర్యలకు పాల్పడుతున్న ఓ మహిళ, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి చర్యల వీడియో క్లిప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ కావడంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్యాపిటల్ గవర్నరేట్ ప్రాసిక్యూషన్ హెడ్ ఈ సంఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తును పూర్తి చేసిందని, ఇద్దరు అనుమానితులను దిగువ క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేసినట్లు చెప్పారు. నిందితులు అసభ్యకర చర్యలకు పాల్పడ్డారని, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను దుర్వినియోగం చేశారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారిపై అభియోగాలు మోపింది. వైరల్ అవుతున్న క్లిప్‌పై నివేదిక అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభించామని క్యాపిటల్ గవర్నరేట్ ప్రాసిక్యూషన్ హెడ్ తెలిపారు. ఆ వీడియో క్లిప్‌ను తానే స్వయంగా ప్రచురించినట్లు విచారణలో సదరు మహిళ అంగీకరించింది. వీడియోలో నిందితుడు ధరించిన దుస్తులను విక్రయించిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







